Saturday, July 2, 2016

ఏమిటి ‘9’ సంఖ్యకు ప్రత్యేకత............!!


సంఖ్యకు సనాతన ధర్మంలో విశేష ప్రాధాన్యం వుంది. జగద్గురువు శ్రీకృష్ణ భగవానుడు మానవాళికి ఇచ్చిన మహాకానుక భగవద్గీత. ఈ పవిత్ర గ్రంథంలో మొత్తం 18 అధ్యాయాలు వున్నాయి. 18ని ఏకసంఖ్యగా మారిస్తే 9 అవుతుంది. భగవత్‌ పురాణంలో భగవంతుని ఆరాధనకు సంబంధించి తొమ్మిది రకాలైన ప్రార్థనా పద్ధతులున్నాయి. అవి శ్రవణం, కీర్తనం, మననం, పదసేవ, అర్చన, మంత్రం, సేవ, మైత్రి, శరణం. సంపదలకు అధిపతి కుబేరుడి వద్ద నవనిధులు వున్నాయి. అలాగే నవరత్నాల గురించి తెలిసిందే. నవధాన్యాలు కూడా తొమ్మిది సంఖ్యలో వుండటం గమనార్హం. అలాగే అష్టోత్తర శత నామావళిని చదువుతాం. 108 కూడా కూడితే 9 కావడం విశేషం. అలాగే మానవదేహంలో నవనాడులున్నాయి. మహాభారత యుద్ధం జరిగిన రోజులు 18, అష్టాదశ శక్తి పీఠాలు 18, మహాభారత యుద్ధంలోని అక్షౌహిణీలు 18, మహాభారతంలోని పర్వాలు 18... వీటిని కూడా ఏకసంఖ్యగా కూడితే 9 వస్తుంది. సంఖ్యాశాస్త్రంలో తొమ్మిదికి అధిపతి కుజుడు. అందుకే 9ని విశిష్టమైన సంఖ్యగా అనేకమంది భావిస్తారు. వాహనాలకు నెంబర్లు కేటాయించేటప్పుడు 9 సంఖ్యకు డిమాండు వున్న సంగతీ తెలిసిందే.

No comments:

Post a Comment