భారతీయుల సంస్కృతి, సంప్రదాయాలలో తులసికున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రతి హిందువుల ఇంటి ముందు తులసి మొక్క పెట్టుకుంటారు. తులసిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ప్రస్తుతమున్న అపార్ట్ మెంట్లలో కూడా చిన్నదైనా సరే తులసి మొక్క పెట్టుకుంటే మంచిదని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అయితే తులసి మొక్కకు ఇంత ప్రాధాన్యత ఎందుకు ? ఇంటి ముందు తులసి మొక్క ఉండాల్సిందేనా ? ఈ ఆచారం వెనక ఉన్న కారణమేంటి ? పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాల వెనక ఖచ్చితంగా ఆరోగ్య కారణాలతో పాటు, సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి. అందుకే వాటిని సంప్రదాయం రూపంలో అయితే.. మనం పర్ఫెక్ట్ గా ఫాలో అవుతామని.. ఖచ్చితంగా పాటిస్తామని సూచిస్తారు. ఇంటి ముందు తులసి మొక్క పెట్టుకోవడం వెనక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, సైంటిఫిక్ రీజన్స్ కూడా దాగున్నాయి.
సాధారణంగా ప్రతి మొక్క, చెట్టు కార్భన్ డై ఆక్సైడ్ పీల్చుకుని, ఆక్సిజన్ వదులుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ తులసి మొక్క ఇందుకు భిన్నమైనది. తులసి రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ ను వదిలే అద్భుతమైన గుణం కలిగి ఉంటుంది. అందుకే ఈ మొక్కను ఇంటి ముందు పెట్టుకోవడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ పొందవచ్చనే ఉద్ధేశ్యంతో ఈ సంప్రదాయం తీసుకొచ్చారు. తులసి సర్వరోగ నివారిణి అలాగే తులసి మొక్కలో అనేక ఔషధ గుణాలున్నాయి. ఘాటైన సువాసన కలిగిన తులసి.. ఈగలు, దోమలు, పాములు, క్రిమీకీటకాలను ఇంట్లోకి రాకుండా కాపాడుతుంది. అందుకే భారతీయ సంప్రదాయంలో తులసికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాదు.. తులసి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటి మీద పిడుగు పడదని పరిశోధకులు తేల్చాయి. ఇంతటి గొప్ప గుణాలు కలిగిన తులసి మొక్క ఇంటి ముందు ఉండటం శ్రేయస్కరమే కదా..!
No comments:
Post a Comment