Wednesday, March 9, 2016

గ్రహణ సమయంలో గాయత్రీ మంత్రం, మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే.....!!


గ్రహణం సమయంలో కాలంలో భోజనం చేయడం, నీరు త్రాగడం చేయకూడదు. గ్రహణం సమయంలో నిద్రపోవడం, తైలాభ్యంగన స్నానం చేయకూడదు. గ్రహణ సమయంలో పిల్లలు, వృద్ధులు, రోగాలతో బాధపడుతున్నవారికి తినడంపై ఎలాంటి నిషిద్ధం లేదు. గ్రహణం పట్టిన సమయంలో వండిన అన్నం, తరిగిన కూరగాయలు, పండ్లు కలుషితమౌతాయి. వీటిని భుజించకూడదు.
అన్నం, నెయ్యి, లస్సీ, వెన్న, పన్నీరు, ఊరగాయలు, చట్నీ, నూనె, పాలు, పెరుగులో నువ్వులు లేదా దర్బలు ఉంచితే ఆ పదార్థాలు కలుషితం కావని జ్యోతిష్యులు అంటున్నారు. డ్రై ఫుడ్‌లపై నువ్వులు లేదా దర్బలు ఉంచాల్సిన అవసరం లేదు.
గ్రహణం సమయంలో ఏదైనా మంత్రాన్ని పఠిస్తే అది శీఘ్రంగా ఫలిస్తుందంటున్నారు. ప్రధానంగా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే కష్టాలు తొలగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. గర్భిణీ స్త్రీలు గ్రహణం పట్టే సమయంలో సూర్య కాంతి పడేలా కూర్చోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూరగాయలు తరగడం కూడదు.
ఈ గ్రహణం పట్టే కాలంలో వశీకరణం, శత్రుపీడనం నుంచి విముక్తి లభించేందుకు, మనసు ప్రశాంతంగా ఉండేందుకు గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల ఫలితం ఆశాజనకంగా ఉంటుంది.

No comments:

Post a Comment